Breaking News
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!

బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!
బొబ్బిలి ఎమ్మెల్యే- బేబీ నాయన కు వినతి..!
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ సంఘ అధ్యక్షులు – సునీల్ కుమార్.!

విజయనగరం జిల్లా బొబ్బిలి 07

బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే రంగారావు (బేబీ నాయన) కు ఆ సంఘ అధ్యక్షులు కాగాన, సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు, అక్కేరేపు, అప్పారావు, కార్యదర్శి, కురమాన, రామకృష్ణ, కోశాధికారి, ఎన్.వి, నాయుడు, సలహాదారులు మురళి లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల కమిటీని నూతనంగా ఏర్పాటు చేశామని, జర్నలిస్టుల సమస్యలలో  ముఖ్యమైనది బొబ్బిలి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని వారు కోరారు. జర్నలిస్టులు ప్రజా సేవకై నిరంతరము సమాచారాన్ని వార్తలను సేకరించి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి బొబ్బిలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా బొబ్బిలిలో ఇంతవరకు “బొబ్బిలి” ప్రెస్ క్లబ్” నిర్మాణానికి, ఎలాంటి, ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ సహకరించలేదని వారు అన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బేబీ నాయన అయినా  బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల కమిటీ తరఫున “బొబ్బిలి ప్రెస్ క్లబ్” నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేసి నిర్మాణం చేసుకోడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం బొబ్బిలి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్,
కె, నారాయణరావు ను మరియు బొబ్బిలి తహసిల్దార్ ఎం, శ్రీను, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎస్,ఐ, శ్రావణ్ కుమార్, మండల అభివృద్ధి అధికారి రవి కుమార్,ను మర్యాదపూర్వకంగా కలిసి బొబ్బిలిలో నూతనంగా ఏర్పాటు చేసిన బొబ్బిలి నాన్ అక్రిడేషన్”
జర్నలిస్టుల సంఘానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి మీ ద్వారా ప్రజల కు తెలియజేయవలసిన వార్తా సమాచారాన్ని ఎల్లప్పుడూ వారికి తెలియజేస్తూ ప్రజా సమస్యలను అధికారులకు ప్రజా ప్రతినిధులకు నిరంతరం అందించడంలో తమ వంతు  కృషి చేస్తామని ఆ సంఘ అధ్యక్షులు సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు అక్కేరేపు, అప్పారావు, కార్యదర్శి, కురమాన, రామకృష్ణ, కోశాధికారి ఎం,వి, నాయుడు, సలహాదారులు మురళి, ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొద్దాన  శ్రీనివాసరావు, పొలుబోతు అమర్నాధ్, కోట శ్రీనివాసరావు, బేత సురేష్, రామకృష్ణ,(చంటి) మురళి, మూర్తి, మాస్టారు, పాతిరెడ్డి హరి, విజయ్, సి,హెచ్, శ్రీనివాసరావు, కిషోర్, బొబ్బిలి గణేష్, మహేష్, శ్రీనివాస్, జామి సీతారాం, సతీష్, దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

సాలూరులో ప్రమాదాల నివారణకు సంయుక్త తనిఖీలు – కీలక నిర్ణయాలు



సాలూరు: పట్టణ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను అధికారులు సంయుక్తంగా పరిశీలించారు.

ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్, ఆర్ & బి శాఖ AEE విజయ్‌కుమార్ మరియు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కలిసి నిర్వహించారు. ప్రమాదాల నివారణకు పలు కీలక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

👉 జంక్షన్ల వద్ద దిశా సూచిక బోర్డులు ఏర్పాటు
👉 స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
👉 జీబ్రా క్రాసింగ్‌లు, స్టాప్ లైన్లు, స్పీడ్ బ్రేకర్లపై రిఫ్లెక్టివ్ పెయింటింగ్
👉 జంక్షన్ ముందు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగ నియంత్రణ
👉 తగినంత వీధి దీపాల ఏర్పాటు
👉 రోడ్డు పక్కన దృశ్యాన్ని అడ్డుకుంటున్న పొదలు, మొక్కల తొలగింపు
👉 బ్లైండ్ కర్వ్‌లు, జంక్షన్ల వద్ద కన్వెక్స్ మిర్రర్ల ఏర్పాటు
👉 మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్‌పై కఠిన చర్యలు
👉 బైపాస్ రోడ్‌పై భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక పర్యవేక్షణ

ప్రజల భద్రత కోసం ఈ చర్యలు త్వరలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

పల్లె ప్రాంతాల ప్రగతే కూటమి ప్రభుత్వ ధ్యేయం


*పల్లె ప్రాంతాల ప్రగతే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

*స్వచ్ఛాంధ్ర సాధనే  ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యం*

*పూతలపట్టు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం*

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్*

*తవణంపల్లి మండలంలో పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు*
——————————
చిత్తూరు -21-03-26
——————————

పల్లె ప్రాంతాల ప్రగతే  కూటమి ప్రభుత్వ ధ్యేయమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఉద్ఘాటించారు.
స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, సీఎం కృషిని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పూర్తి, ఆయన ప్రోత్సాహంతో పూతలపట్టు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని ఎంపీ, ఎమ్మెల్యేలు తెలియజేశారు.

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్లతో కలిసి, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూ.. కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని స్థానిక ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు.

అంతకు ముందు తవణంపల్లెకు చేరుకున్న ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్కు ఆ మండలం తెలుగు దేశం పార్టీ మండలాధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. అడుగడుగునా కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు.

ముందుగా తవణంపల్లి మండలంలోని కొండ్రాజు కాలువ గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్యం విగ్రహాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు..,ఐఏఎస్ అధికారి నక్కల ప్రభాకర్ రెడ్డి చొరవతో  కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన.., కోటి పదిలక్షల రూపాయల వ్యయంతో వెంగంపల్లిలో నిర్మించి తలపెట్టిన శ్రీరాముల వారి ఆలయం నూతన నిర్మాణ భూమి పూజ
కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే వెంగంపల్లిలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం వద్దకు చేరుకుని.., ఆధునిక హంగులతో నిర్మించిన ఆ బిల్డింగ్ను పరిశీలించారు.అనంతరం అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన గోవిందరెడ్డిపల్లికి చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలు.. ఆ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అక్కడే ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించి, తాగునీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

అదేవిధంగా ఏ గొల్లపల్లెలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని స్థానిక ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు.

అదే గ్రామానికి సంబంధించిన స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను, మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్..,స్మశాన వాటిక భద్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన కాంపౌండ్ వాల్ను వారు ప్రారంభించారు.

తర్వాత ఆ ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వచ్చ భారత్ , అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొని, తడి చెత్త-పొడి చెత్తను వేరు చేసి డంప్ చేసేందుకు స్థానిక మహిళలకు ఎరుపు , పచ్చరంగు డబ్బాలు.., మామిడి కాయల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాంగో హార్టికల్చర్ అధికారులు తయారుచేయించిన, కవర్లను మామిడి రైతులకు పంపిణీ చేశారు. మామిడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు.

అదే మండలంలోని మాధవరం ఎంపిపి పాఠశాలలో జిల్లా పరిషత్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు.

ఇకపోతే గోవింద రెడ్డి పల్లెలో నూతనంగా నిర్మించిన రెండు ఓం శక్తి ఆలయాలను ప్రారంభించారు. ఓం శక్తి భక్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ… పూతలపట్టు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి ఎంపీ, ఎమ్మెల్యేలమైన తాము సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని వారు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ ఆ ప్రాంత ప్రజలను కోరారు.

కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జులు ప్రవీణ్, మోహన్ నాయుడు, బంగారుపాలెం మండలాధ్యక్షులు ధరణి, టిడిపి సీనియర్ నేత ఎన్.పి. ప్రకాష్,మాజీ కన్వీనర్ దిలీప్ కుమార్, మార్కెట్ చైర్మన్ భాస్కర్ నాయుడు, టిడిపి మహిళా నేతలు ఇందిరమ్మ, చిట్టెమ్మ,ఏ.గొల్లపల్లి పంచాయతీ సర్పంచ్ సబిత, టిడిపి నాయకులు గోపి యాదవ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

*ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

✍️*అట్టహాసంగా వినోబా నగర్ బీటీ రోడ్డు ప్రారంభోత్సవం*

✍️ *హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే*

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.

శనివారం నాగలాపురం మండలం వినోబా నగర్ కు ఎమ్మెల్యే చేరుకొని నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు ను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం అదే గ్రామంలో నిర్మాణం పూర్తి చేసిన హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు.

తమ గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన బీటీ రోడ్డు నిర్మాణానికి అన్నీ విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే ఆదిమూలం కు ప్రజలు మంగళ హారతి పట్టి గజ మాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వినోబా నగర్ బీటీ రోడ్డు కోసం గత ప్రభుత్వం లో పెద్ద పోరాటమే చేశానన్నారు.

అప్పట్లో ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయించిన రోడ్డు నిర్మాణం చేపట్టలేక పోయానని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతిపాదన పంపగా వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు.

అలాగే హెల్త్ క్లినిక్ నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజలకు స్థానికంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

వైద్యం కోసం హెల్త్ క్లినిక్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారి, సిబ్బందిని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

టీటీడి శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు రూ.10 లక్షలు విరాళం అందించారు

టీటీడి శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో ఆయనకు విరాళం డిడిన అందజేశారు

తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

*తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు*

న్యూ ఢిల్లీ :

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సెలింగ్ గడువు ముగిసినా ఏపీలో 246, తెలంగాణలో 377 సీట్లు భర్తీ కాలేదని కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు సిద్ధంగా ఉన్నా గడువు పొడిగించలేదని తెలిపాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

ఎమ్మెల్యే చొరవతో జూనియర్ కళాశాల స్థలం సమస్య పరిష్కారం

*ఎమ్మెల్యే చొరవతో జూనియర్ కళాశాల స్థలం సమస్య పరిష్కారం*

✍️ *ఎమ్మెల్యే కోరిక మేరకు కళాశాలను పరిశీలించిన ఆర్డీఓ*

✍️ *గతంలో కేటాయించిన స్థలంలో కాలేజీకి ఇవ్వడానికి ఆర్డీఓ అంగీకారం*

✍️ *దీంతో జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణానికి లైన్ క్లియర్*

✍️ *ఎమ్మెల్యే, ఆర్డీఓ లకు కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం విద్యార్థులు*

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.

గత నెల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కు ప్రహరీ తో పాటు అదనపు తరగతి గదులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో తో మాట్లాడి వెంటనే జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణానికి రూ.25 లక్షలు జడ్పీ నిధులు కేటాయించి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, ఎమ్మెల్యే ఆదిమూలం చేత పనులు కూడా ప్రారంభించేలా చేశారు. అదనపు తరగతి గదులు నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో కళాశాల కు కేవలం 0.72 సెంట్లు మాత్రమే కేటాయించినట్లు రెవిన్యూ శాఖ మెలిక పెట్టింది.

అయితే గత ప్రభుత్వం లోని ఈ కాలేజీ ప్రహరీ నిర్మాణానికి నిధులు, స్థలం కేటాయించి పిల్లర్లు  కు పునాది కూడా వేసి ఆపేసింది.

అయితే ఇప్పుడు 0.72 సెంట్లు మాత్రమే కళాశాల స్థలం, అందులో మాత్రమే ప్రహరీ నిర్మించుకోవాలనడం పై కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను ఆశ్రయించారు.

తక్షణం స్పందించిన ఎమ్మెల్యే వెంటనే శ్రీ కాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ కు సమస్యను వివరించారు. ఎమ్మెల్యే కోరిక మేరకు ఆర్డీఓ భాను ప్రకాష్, ఎమ్మెల్యే ఆదిమూలం తో కలిసి శనివారం మధ్యాహ్నం పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ను పరిశీలించారు.

ప్రభుత్వ భూమి పుష్కలంగా ఉండడంతో పాటు గ్రామస్తులకు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో కళాశాలకు గతంలో ఇచ్చిన విస్తీర్ణం కేటాయించాలని ఆర్డీఓ భాను ప్రకాష్ అక్కడే ఉన్న తహశీల్దారు టీవీ సుబ్రమణ్యం ను ఆదేశించారు.

దీంతో జూనియర్ కళాశాల స్థలం సమస్య పరిష్కారం కావడంతో పాటు ప్రహరీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. వెంటనే తహశీల్దారు సుబ్రమణ్యం ప్రహరీ నిర్మించే డీఈ గోపాల్ కు ఆర్డీఓ, ఎమ్మెల్యే సమక్షంలో ఫోన్ చేసి గతంలో కేటాయించిన స్థలంలో కాలేజీకి ప్రహరీ నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు.

తమ కళాశాలకు స్థలం సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి లైన్ క్లియర్ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆర్టీఓ భాను ప్రకాష్ లకు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బృందం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ టీవీ సుబ్రమణ్యం, కళాశాల ప్రిన్సిపాల్ వెంకట సుబ్బమ్మ, డీఈ గోపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యులు డి.సుమాంజలి, తెలుగుదేశం పార్టీ నాయకులు పద్దు రాజు, వెంకటరత్నం నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన సిఎం చంద్రబాబునాయుడు కుటుంబం..

తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన సిఎం చంద్రబాబునాయుడు కుటుంబం..

స్వర్గీయ నందమూరి తారకరామారావు హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల మంది ఆకలిని తీర్చుతోంది.
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
ఈ ట్రస్టుకు తన మనుమడు దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందిస్తున్నారు.
ఒక్కరోజు అన్నదానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని సీఎం కుటుంబం అందజేసింది.
దేవాన్ష్ పేరుతో అన్నదానం కోసం ఇప్పటి వరకు 12 సార్లు విరాళం అందించారు.

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు…

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు.

తిరుమల/గరుడ ధాత్రి/మార్చి 21

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు మంత్రి శ్రీ లోకేష్ లతో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా గౌ|| ముఖ్యమంత్రివర్యులు ఆలయంలోకి ప్రవేశించారు.

మహద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.

శ్రీవారిని దర్శించుకున్న గౌ|| ముఖ్యమంత్రివర్యులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలు, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో అప్రమత్తంగా ఉండండి

*ముఖ్యమంత్రి పర్యటనలో అప్రమత్తంగా ఉండండి.*

*ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య*

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులు పాటు తిరుపతి, తిరుమల పర్యటన ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారుల ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న మార్గాలలో జరుగుతున్న ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 20,21 తేదీల్లో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా తిరుపతి, తిరుమల కు రానున్నారని, ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో పారిశుధ్థ్యం మెరుగ్గా ఉండేలా చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లపైన ఎటువంటి గుంతలు లేకుండా చూడాలని, డివైడర్ల మధ్యలో మొక్కలు కత్తిరించాలని, రోడ్డు పక్కన మట్టి, విరిగిన చెట్ల కొమ్మలు లేకుండా శుభ్రం చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలిపిరి, జూ పార్కు రోడ్ల పక్కన ఎటువంటి దుకాణాలు పెట్టకుండా చూడాలని తెలిపారు.  అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.మధు, డిసిపీ దేవి కుమారి, ఏసీపీ లు పార్వతి ప్రియ, మూర్తి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.